- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video: అవసరమా..? తన షాట్ సెలెక్షన్‌ను తనే తిట్టుకున్న రిషభ్ పంత్!
తన రిస్కీ షాట్ సెలెక్షన్‌ను తనే తిట్టుకున్నాడు రిషభ్ పంత్. కొన్ని లైఫ్‌లు దొరకగానే ఇదంతా అవసరమా? అంటూ తిట్టుకోవడం స్టంప్ మైక్‌లో రికార్డయింది.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు రిస్కీ షాట్లు ఆడటం కొత్తేంకాదు. టెస్టు క్రికెట్లో అతన్ని అత్యంత ప్రమాదకరంగా మార్చేది ఆ షాట్లే. అయితే చాలాసార్లు ఇలాంటి రిస్కీ షాట్లు ఆడటం వల్లనే పంత్ అవుట్ అవుతుంటాడు. అప్పుడు చాలామంది మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శల వర్షం కురిపించడం కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి కొత్తగా తనను తానే తిట్టుకున్నాడు రిషభ్ పంత్. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుటైన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు.
క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఆడిన రెండో బంతినే ముందుకొచ్చి ఆడబోయాడు. అది ఎడ్జ్ తీసుకొని బౌండరీకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఒక టాప్ ఎడ్జ్.. ఫైన్ లెగ్ దిశగా ఫోర్ వెళ్లింది. మరో ఇన్‌సైడ్ ఎడ్జ్.. ప్యాడ్లను తాకింది. ఇలా పలు లైఫ్‌లు దక్కడంతో తన షాట్ సెలెక్షన్‌ను తనే తిట్టుుకన్నాడు పంత్. స్టంప్ మైక్‌వైపు చూస్తూ.. ‘అసలు ఎందుకిలా చేస్తున్నావ్? అసలు ఇది అవసరమా?’ అని తనపై తనే కోపం ప్రదర్శించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
DK translates what Rishabh Pant was saying! 🤓🔊 pic.twitter.com/ofGWM4OfOp
— Sky Sports Cricket (@SkyCricket) June 23, 2025






