- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌతాఫ్రికా చేతిలో సిరీస్ వైట్‌వాట్.. ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్
రెండో టెస్టులో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ అయ్యింది.

దిశ, స్పోర్ట్స్ : రెండో టెస్టులో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ అయ్యింది. సిరీస్ కోల్పోవడం కంటే భారత ప్లేయర్లు ఆడిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గురువారం సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టాడు. అంచనాలను అందుకోవడంలో విఫలమైనందుకు క్షమించాలని అభిమానులను కోరాడు. ‘గత రెండు వారాలుగా మేము మంచి క్రికెట్ ఆడలేదన్నది వాస్తవం. జట్టుగా, వ్యక్తులుగా మేము ప్రతిసారి అత్యున్నత స్థాయి ప్రదర్శన చేయాలని, భారత అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే కోరుకుంటాం. కానీ, ఈ సారి మేము అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. క్రీడ జట్టుగా, వ్యక్తులుగా నేర్చుకోవడాన్ని, ఎదగడాన్ని నేర్పుతుంది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గొప్ప గౌరవం. జట్టు సామర్థ్యమేంటో మాకు తెలుసు. బలంగా, మెరుగ్గా తిరిగి రావడానికి కష్టపడతాం. మీ మద్దతుకు, ప్రేమకు ధన్యవాదాలు. జై హింద్.’అని పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. గాయం కారణంగా కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరం కావడంతో ఆ మ్యాచ్‌లో పంతే భారత జట్టును నడిపించాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో పంత్ విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో కేవలం 49 రన్సే చేశాడు.






