- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ, పంత్ ప్రాక్టీస్ షురూ.. బెంగళూరులో చెమటోడుస్తున్న స్టార్లు
కోహ్లీ, పంత్ ప్రాక్టీస్ షురూ చేశారు. బెంగళూరులో చెమటోడుస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ కోసం రెడీ అవుతున్నారు.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ ఇద్దరూ విజయ్ హజారే ట్రోఫీకి సన్నద్ధం అవుతున్నారు. ఢిల్లీ తరఫున బరిలో దిగుతున్న ఈ ఇద్దరు స్టార్లు.. ఆంధ్రతో బుధవారం జరిగే మ్యాచులో పాల్గొంటారు. ఈ క్రమంలోనే బెంగళూరు వేదికగా నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ, పంత్, ఇషాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సుమారు 15 ఏళ్ల తర్వాత కోహ్లీ మళ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతుండటంతో అభిమానుల్లో ఈ టోర్నీపై ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా వైట్ బాల్ క్రికెట్లో స్థిరంగా అవకాశాలు పొందలేకపోతున్న పంత్‌కు కూడా ఇది మంచి అవకాశమని విశ్లేషకులు అంటున్నారు.
చిన్నస్వామిలో లేనట్టే?
ఆంధ్రతో జరిగే ఈ మ్యాచ్‌తోపాటు ఓపెనింగ్ ఫేజ్‌లో పలు మ్యాచులకు చిన్నస్వామి స్టేడియమే ఆతిథ్యం ఇవ్వాల్సింది. కానీ ఆర్సీబీ ఈవెంట్ సమయంలో తొక్కిసలాట తర్వాత స్టేడియం భద్రతపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. ఇక్కడ మ్యాచులు నిర్వహించేందుకు అనుమతించలేదు. దీంతో ఢిల్లీ తొలి మ్యాచుతోపాటు పలు మ్యాచులను బెంగళూరు అవుట్‌స్కర్ట్స్‌లో ఉణ్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెన్యూలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.






