రింకూ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ అంటే?

by velandi.Saikiran |

కేకేఆర్ (KKR) డేంజర్ ఆటగాడు రింకూ సింగ్ ( Rinku Singh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రింకూ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ అంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : కేకేఆర్ (KKR) డేంజర్ ఆటగాడు రింకూ సింగ్ ( Rinku Singh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమాజ్ వాది పార్టీకి సంబంధించిన.. యువ పార్లమెంట్ సభ్యులు ప్రియా సరోజ్ తో ( mp priya saroj) రింకూ సింగ్ వివాహం జరగబోతున్నట్లు.. నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అప్పట్లోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందు జరిగింది.

అయితే... ఇప్పుడు ఈ ఇద్దరి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలోనే ఎంపీ ప్రియా సరోజ్ తో టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ వివాహం జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 8వ తేదీన లక్నో వేదికగా... ఈ జంటకు సంబంధించిన నిశ్చితార్థం జరగనుందట. అలాగే నవంబర్ 18వ తేదీన వారణాసిలో... వివాహం జరుగుతుందని ఈ సమాచారం అందుతుంది.

అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. చర్చ అయితే మొదలైంది. దీనిపై త్వరలో ప్రకటన వచ్చే ఛాన్సులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రింకూ సింగ్ పెళ్లి చేసుకోబోయే.. అమ్మాయి ప్రియా సరోజ్ వయస్సు 26 సంవత్సరాలు. ఆమె పార్లమెంటు సభ్యుల ఏ కాకుండా.. న్యాయవాది వృత్తిలోనూ రాణిస్తున్నారు. ఆమె తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటు రింకూ సింగ్ కేకేఆర్ జట్టుతో పాటు.. టీమిండియాలో కూడా రాణిస్తున్నాడు.

Next Story