క‌ష్టాల్లో ఉన్న భార‌త జ‌ట్టు, వ‌దిలేసి వెళ్లిపోయిన రింకు సింగ్

by velandi.Saikiran |

కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా భార‌త జ‌ట్టును వీడి, సొంతూరుకు వెళ్లాడు రింకు సింగ్.

క‌ష్టాల్లో ఉన్న భార‌త జ‌ట్టు, వ‌దిలేసి వెళ్లిపోయిన రింకు సింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ లో అవకాశం దక్కించుకున్న రింకు సింగ్ ( RINKU SINGH) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కష్టాల్లో భారత జట్టు ఉన్న సమయంలో, ఇంటికి పయనమయ్యాడు రింకు సింగ్. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ పేరుతో, ఇంటికి వెళ్లిపోయాడు రింకు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సూపర్ 8 లో రేపు జింబాబ్వే, భారత జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే తన తండ్రి ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో, ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేసి హుటా హుటిన సొంతూరుకు వెళ్లిపోయాడు రింకు సింగ్. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాదు భారత జట్టును మధ్యలో వదిలేసిన రింకు సింగ్ ను ఉద్దేశించి ఫ్యాన్స్ కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఇంటికి వెళ్లిపోయిన రింకు సింగ్.. అసలు ఏమైందంటే ?

టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో చివరి క్షణంలో రింకు సింగ్ స్థానం దక్కించుకున్నాడు. అతడు ఏడో స్థానం లేదా ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. టీ20 క్రికెట్ కావడంతో రింకు సింగ్ కు బ్యాటింగ్ చేసే అవకాశం చాలా తక్కువగా వస్తుంది. వచ్చిన అవకాశాన్ని కచ్చితంగా వినియోగించుకోవాలి. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు రింకు సింగ్ పెద్దగా రాణించలేదు. దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా రింకు సింగ్ కు అవకాశం వచ్చింది. కానీ పరుగులు ఏమి చేయకుండా వెనుతిరిగాడు రింకు సింగ్. ఇలాంటి నేపథ్యంలో రింకు సింగ్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయింది. కష్టాల్లో ఉన్న భారత జట్టును వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు రింకు సింగ్.

ప్రస్తుతం రింగు సింగ్ తండ్రి ఖాన్ చందు సింగ్ గ్రేటర్ నోయిడా లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రింకు సింగ్ తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. ఈ సమాచారం రింకు సింగ్ కు అందింది. ఈ నేపథ్యంలోనే భారత జట్టును వదిలేసి ఆసుపత్రికి పయనమయ్యాడు. ప్రస్తుతం రింకు సింగ్ ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడు వెనక్కి వస్తాడా ? లేక అక్కడే ఉండిపోతాడా ? అనేది తెలియాల్సి ఉంది. రింకు సింగ్ రిటర్న్ అయ్యే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ రింకు సింగ్ జింబాబ్వేతో జరిగే మ్యాచ్ ఆడకపోతే కొత్త ప్లేయర్ జట్టులోకి వస్తాడు. సంజు శాంసన్ కు అవకాశం ఇస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండ‌గా టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా భార‌త్ ( India), జింబాబ్వే మ‌ధ్య చెన్నై వేదిక‌గా మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఇందులో భార‌త్ క‌చ్చితంగా గెలవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.


Next Story