ఐపీఎల్ ఆధారంగా కోచ్ ప‌దవి ఇచ్చారు..గంభీర్ ప‌రువు తీసిన పాంటింగ్ !

by velandi.Saikiran |

న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుపై విమర్శలు చేశారు రికీ పాంటింగ్.

ఐపీఎల్ ఆధారంగా కోచ్ ప‌దవి ఇచ్చారు..గంభీర్ ప‌రువు తీసిన పాంటింగ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఇందులో రెండు మ్యాచ్ లు గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఒకే ఒక వన్డేలో గెలిచిన భారత్, మాత్రం సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో కూడా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది భారత్. అది సొంత గడ్డపై జరగడం ఘోర అవమానమే. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ కూడా గంభీర్ ఆధ్వర్యంలోనే కోల్పోయింది భారత్. ఇలాంటి నేపథ్యంలో గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ‌స్తున్నాయి.

గంభీర్ పరువు తీసిన రికీ పాంటింగ్ !

న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుపై విమర్శలు చేశారు రికీ పాంటింగ్. సొంత గడ్డపై భారత్ ఓడిపోవడం దారుణం అన్నారు. చెత్త ప్రదర్శన కారణంగానే ఇది జరిగిందని విమర్శలు చేశారు పాంటింగ్. ఐపీఎల్ ఆధారం చేసుకుని గౌతమ్ గంభీర్ కు హెడ్ కోచ్ పదవి ఇచ్చారని బీసీసీఐని తప్పుబట్టారు పాంటింగ్. ఐపీఎల్ ఆధారంగా చేసుకొని ప్లేయర్లను కూడా సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. సొంత గడ్డపై ఓడిపోయినంత మాత్రాన భారత జట్టును తక్కువ అంచనా వేయలేమన్నారు.

Next Story