- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్‌లో రివేంజ్ వీక్ ప్రారంభం.. చెన్నైపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపీఎల్‌లో రివేంజ్ వీక్ ప్రారంభం! గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, చెన్నై బ్యాటింగ్ చేస్తోంది. ధోనీ ఆడకపోవడంతో అభిమానుల్లో నిరాశ.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా అన్ని జట్లు సగం మ్యాచులు ఆడేశాయి. దీంతో నేటి నుంచి రివేంజ్ వీక్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా 37వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం లో ప్రారంభమైన ఈ మ్యాచ్ టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది దీంతో చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. పాయింట్ల పట్టికలో చెన్నై 5వ స్థానంలో ఉండగా. గుజరాత్ జట్టు 7వ స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
ధోని అభిమానులకు మళ్లీ నిరాశే..
ఈ సీజన్ లో ఇప్పటికే సగం మ్యాచులు పూరైనప్పటకి ధోని ఆడకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ మ్యాచులో అయిన ఆడతాడని ఆశించిన అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సీజన్ చివర్లో నాలుగు మ్యాచులు ధోని ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్






