Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. వన్డే ఫార్మాట్‌కు మరో స్టార్ క్రికెటర్ గుడ్‌బై

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-06 02:41:55  IST  )

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) చరమాంకానికి చేరిన వేళ సీనియర్ ఆటగాళ్లు వన్డేలకు గుడ్ చెబుతున్నారు.

Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. వన్డే ఫార్మాట్‌కు మరో స్టార్ క్రికెటర్ గుడ్‌బై
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) చరమాంకానికి చేరిన వేళ సీనియర్ ఆటగాళ్లు వన్డేలకు గుడ్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, బంగ్లాదేశ్ (Bangladesh) స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) వన్డే ఫార్మాట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించాడు. ఈ మేరకు అతడి నిర్ణయాన్ని సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌ (Facebook) వెల్లడించాడు. ‘నేను ఈరోజు నుంచి వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటిస్తున్నా. ప్రతిదానికి అల్హమ్‌దులిల్లాహ్.. మా విజయాలు ప్రపంచ స్థాయిలో పరిమితమైనప్పటికీ, ఒక్కటి మాత్రం నిజం. నేను నా దేశం తరఫున మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా అంకితభావం, నిజాయితీతో 100శాతం ప్రదర్శన చేశా’ అంటూ రహీమ్ పోస్ట్ చేశాడు. అదేవిధంగా 19 ఏళ్లగా తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. రహీమ్ 2022లో టీ20లకు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో ఇక కేవలం అతడు టెన్స్ ఫార్మాట్‌లోనే కొనసాగనున్నాడు. ముష్ఫికర్ రహీమ్ ఆగస్టు, 2006లో జింబాబ్వే (Zimbabwe)పై వన్డేల్లో అరంగేట్రం చేశారు. 274 వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు కూడా ఉన్నాయి.

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) సెమీఫైనల్‌లో భారత్‌పై అత్యధిక స్కోరు సాధించిన స్టీవ్ స్మిత్ బుధవారం వన్డే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించాడు. ఇక స్మిత్ కేవలం టెస్ట్‌లు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. ఆస్ట్రేలియా (Australia)లో అత్యంత విజయవంతమైన వన్డే ఆటగాళ్లలో స్మిత్ ఒకడు. 2010లో వెస్టిండీస్‌పై స్పిన్నర్ కమ్ ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేసిన స్మిత్.. 170 వన్డేలు ఆడి 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 34.67 సగటుతో 28 వికెట్లు తీసుకున్నాడు. 2015, 2023లో ఆస్ట్రేలియా ఐసీసీ ప్రపంచ కప్ గెలిచిన జట్లలో సభ్యుడైన స్మిత్ 2015లో వన్డే కెప్టెన్ (ODI captain) అయ్యాడు.

Next Story