- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Team India: వరల్డ్ కప్ విజేతలకు డైమండ్స్ గిఫ్ట్ !
సూరత్ కు చెందిన ఇద్దరు ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్తలు నజరానా ప్రకటించారట. భారత సభ్యులకు ఆభరణాలను గిఫ్ట్

దిశ, వెబ్ డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( Womens World Cup 2025) విజేతగా టీమిండియా (India Women Team) నిలిచిన సంగతి తెలిసిందే. ముంబై వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది టీమిండియా. ఏకంగా 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. ఫీల్డింగ్, బౌలింగ్ అలాగే బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కూడా టీమిండియా అద్భుతంగా రాణించింది. ఇక టీమిండియా ఛాంపియన్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
అయితే వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో సూరత్ కు చెందిన ఇద్దరు ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్తలు భారీ నజరానా ప్రకటించారట. భారత జట్టు సభ్యులకు వజ్రాలు పొదిగిన ఆభరణాలను గిఫ్ట్ గా ఇచ్చేందుకు వాళ్ళు ముందుకు వచ్చారట. వాటితో పాటు సోలార్ ప్యానళ్లను కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ కంటే ముందే ఈ ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు టీమిండియా ఛాంపియన్ కావడంతో ఆ ఇద్దరు వ్యాపారస్తులు వజ్రాల ఆభరణాలు ప్లేయర్లకు అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా వెలువడలేదు. సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వైరల్ అవుతున్నాయి. క్లిక్






