కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్సీబీకి బిగ్ రిలీఫ్

by Harish |

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఊరట.లభించింది.

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్సీబీకి బిగ్ రిలీఫ్
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఊరట. వచ్చే ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టు విజయోత్సవాల్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన‌ తర్వాత చిన్నస్వామి స్టేడియం పెద్ద ఈవెంట్‌లకు సరిపోదని జస్టిస్ జాన్ మైఖేల్ కున్హా కమిషన్ కర్ణాటక ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

దీంతో ఆ ఘటన తర్వాత బెంగళూరులో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. వచ్చే ఐపీఎల్ సీజన్‌ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి తరలించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక క్యాబినేట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పింది. జస్టిస్ కున్హా కమిషన్ సిఫార్సు చేసిన భద్రత, భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇక బెంగళూరును వచ్చే సీజన‌కు వేదికగా చేర్చాలా?లేదా? అన్నది బీసీసీఐ చేతుల్లోనే ఉంది.

Next Story