మహిళల వరల్డ్‌కప్‌కు రికార్డుస్థాయి ప్రైజ్‌మనీ

by Naga Rani Yarlagadda |

ఉమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఇదొక సంచలనం. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీని 2022లో న్యూజిలాండ్ లో జరిగిన టోర్నీకి కేటాయించిన దానికంటే 297 శాతం అధికంగా పెంచుతూ అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

మహిళల వరల్డ్‌కప్‌కు రికార్డుస్థాయి ప్రైజ్‌మనీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఇదొక సంచలనం. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీని 2022లో న్యూజిలాండ్ లో జరిగిన టోర్నీకి కేటాయించిన దానికంటే 297 శాతం అధికంగా పెంచుతూ అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ - శ్రీలంక కలిసి ఆతిథ్యమివ్వనున్న 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కపం కోసం 13.88 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. అంటే సుమారు రూ.122 కోట్లు. ఈ ప్రైజ్ మనీలో టోర్నీలో విజేతగా నిలిచే జట్టు 4.48 మిలియన్ డాలర్లు (రూ.39 కోట్లు) అందుకుంటుంది. రన్నరప్ టీమ్ కు 2.24 మిలియన్ డాలర్లు (సుమారు రూ.19 కోట్లు), సెమీఫైనల్స్ లో ఓడిన జట్లకు 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2 కోట్లు) ఇస్తారు. ఇక గ్రూప్ దశలో ఉన్న ప్రతి జట్టుకు రెండ లక్షల యాభైవేల డాలర్లు (రూ.2కోట్లు) అందనున్నాయి. గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్ కు ఎక్స్ ట్రాగా 34,314 డాలర్లు (సుమారు రూ.30 లక్షలు) అందజేస్తారు. సెప్టెంబర్ 30న గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో భారత్ - శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Next Story