- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : IPL 2025 సరికొత్త రికార్డులు సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొంది రికార్డుకెక్కింది. జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా RCB, PBKS జట్ల మధ్య ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టు తొలిసారి టైటిల్ ను చేజిక్కించుకుంది. కోట్లాది అభిమానులు ఉన్న RCB జట్టు ఫైనల్ కు చేరడంతో ఈ మ్యాచ్ కు రికార్డుస్థాయి 840 బిలియన్ల వ్యూస్ వచ్చాయని జియో హాట్ స్టార్ ప్రకటించింది. ఈ మ్యాచ్ ను టీవీల్లో ఏకంగా 169 మిలియన్ల మంది వీక్షించారని, 16.74 బిలియన్ నిముషాల వాచ్ టైం నమోదు అయిందని వెల్లడించింది. ఇంత ఎక్కువ వ్యూస్ రావడం టీ20 చరిత్రలోనే కాదు, ఐపీఎల్ హిస్టరీలో కూడా ఇదే రికార్డు కావడం గమనార్హం.
Next Story






