క్లబ్ వరల్డ్ కప్ విజేత రియల్ మాడ్రిడ్..

by Disha Web Desk 13 |
క్లబ్ వరల్డ్ కప్ విజేత రియల్ మాడ్రిడ్..
X

మొరాకో: క్లబ్ వరల్డ్ కప్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ జట్టు ఐదోసారి గెలిచి తన రికార్డును కొనసాగించింది. మొరాకోలోని రాబాట్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టు 5-3తో సౌదీ అరేబియాకు చెందిన అల్-హిలాల్ జట్టును ఓడించింది. వినిసియల్ జూనియర్ రెండు గోల్స్ చేయగా.. కరీం బెంజెమ మరో గోల్ సాధించాడు. తర్వాత ఫెడెరికో వెల్వెర్డె మరో రెండు గోల్స్ చేయడంతో యురోపియన్ చాంపియన్ రియల్ మాడ్రిడ్ టైటిల్ విజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో అల్ హిలాల్ జట్టు ఏ స్థాయిలోనూ అధిక్యత ప్రదర్శించలేకపోయింది. అయితే సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్‌కు చెందిన ఫ్లెమింగోను చిత్తు చేసి తుది పోరుకు చేరుకుంది. అల్ హిలాల్ జట్టులో లూసియానో వీయెట్టో రెండు గోల్స్ చేయగా.. మౌస్సా మరెగా ఒక గోల్ సాధించాడు. 2014లో టైటిల్ గెలిచిన మాడ్రిడ్ జట్టు 2016, 2017, 2018లలో కూడా విజేతగా నిలిచింది.

Next Story

Most Viewed