కోహ్లీ అభిమాని అంటే ఆ మాత్రం ఉంటుంది.. వీడియో వైరల్

by Dishanational3 |
కోహ్లీ అభిమాని అంటే ఆ మాత్రం ఉంటుంది.. వీడియో వైరల్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌‌లోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అతని ఆటకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఫ్యాన్స్ తరుచుగా అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లీని హగ్ చేసుకోవడం వంటివి చేస్తారు. బెంగళూరు వేదికగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోనూ అలాంటి సంఘటననే చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో విరాట్ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. మైదానంలోకి దూసుకొచ్చిన అతను నేరుగా కోహ్లీ దగ్గరికి వెళ్లి అతని కాళ్లపై పడ్డాడు. విరాట్‌ను హగ్ చేసుకున్నాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రతి అభిమాని కోహ్లీని కలవాలనుకుంటాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కోహ్లీ అంటే పిచ్చి ఇలాగా ఉంటుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


Next Story