IPL 2025 : ఇంకా మొదలవని RCB vs PBKS మ్యాచ్

by Muthe.Rajitha |

బెంగుళూరు, పంజాబ్(RCB vs PBKS) జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ భారీ వర్షం వలన వాయిదా(IPL Match Postponed) పడిన సంగతి తెలిసిందే.

IPL 2025 : ఇంకా మొదలవని RCB vs PBKS మ్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగుళూరు, పంజాబ్(RCB vs PBKS) జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ భారీ వర్షం వలన వాయిదా(IPL Match Postponed) పడిన సంగతి తెలిసిందే. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం(Benguluru ChinnaSwamy Stadium)లో జరగాల్సిన ఈ మ్యాచ్ నగరంలో సాయంత్రం కురిసిన భారీ వర్షాని(Heavy Rain)కి వాయిదా వేశారు నిర్వహకులు. అయితే ఈ మ్యాచ్ అసలు జరుగుతుందా లేదా అని ఐపీఎల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో అకస్మాత్తుగా భారీ వర్షం మొదలవగా.. గ్రౌండ్ ను కవర్లతో కప్పేసారు స్టేడియం సిబ్బంది.

కాని స్టేడియంలో ఇంకా వర్షం కురుస్తుండటం వలన.. దాదాపు మ్యాచ్ వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు రాత్రి 10.54 గంటల వరకు మ్యాచ్ స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఆలోపు వర్షం ఆగితే కనీసం చెరో 5 ఓవర్ల మ్యాచ్ అయినా సాధ్యం అవుతుందని అంపైర్లు పేర్కొన్నారు. అప్పటికీ వాన తగ్గకపోతే మ్యాచ్ రద్దు చేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.

Next Story