- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులకు గుడ్ న్యూస్. బెంగళూరులోని హోం గ్రౌండ్ అయిన ఎం.చిన్నస్వామి స్టేడియంలోనే ఆర్సీబీ ఐపీఎల్-2026కు సంబంధించిన తమ మ్యాచ్‌లు ఆడనుంది. గతేడాది ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవాలు చివరికి విషాదంగా మారాయి. భారీ అభిమానులు హాజరవడంతో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించారు. దీంతో ఈ సీజన్‌లో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడంపై అనుమానాలు నెలకున్నాయి. కానీ, ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడానికి తలుపులు తెరుచుకున్నాయి. ఈ వేదికపై ఆర్సీబీ ఐదు లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నట్టు ఫ్రాంచైజీ వెల్లడించింది. రాయ్‌పూర్‌లో మరో రెండు మ్యాచ్‌ల్లో పాల్గొంటుందని ఆర్సీబీ సీఈవో రాజేశ్ మీనన్ తెలిపారు. అంతేకాకుండా, చిన్నస్వామి స్టేడియం ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు, ఫైనల్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఐపీఎల్-2026 షెడ్యూల్ రిలీజ్ కానుండటంతో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.






