- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మకానికి ఆర్సీబీ.. అప్పటిలోగా కొత్త ఓనర్!
వచ్చే ఏడాది రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు(పురుషుల, మహిళల)కి కొత్త ఓనర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు(పురుషుల, మహిళల)కి కొత్త ఓనర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ యజమాని యునిటైడ్ స్పిరిట్స్ లిమిటెడ్. ఆ కంపెనీకి మాతృ సంస్థ, యూకేకు చెందిన డియాజియో ఆర్సీబీ అమ్మకానికి పూనుకుంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్చేంజ్‌కు డియాజియో బుధవారం సమాచారం ఇచ్చింది. దీన్ని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యూహాత్మక పెట్టుబడి సమీక్షగా డియాజియో పేర్కొంది. విక్రయ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ముగుస్తుందని తెలిపింది. అయితే, ఫ్రాంచైజీ పూర్తి స్థాయి అమ్మకమా లేదా వాటా విక్రయించడమా అనేది స్పష్టత లేదు. ఈ ఏడాది ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఆర్సీబీ విజయోత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత నుంచే ఆర్సీబీ అమ్మకానికి సంబంధించిన చర్చ మొదలైంది. ఆర్సీబీ ఫ్రాంచైజీపై అదానీ గ్రూపు, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు, అదార్ పూనవాలా(సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), రవి జైపురియా (దేవయాని ఇంటర్నేషనల్ గ్రూపు)తోపాటు అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ పెట్టుబడి సంస్థ ఆసక్తిగా ఉన్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.






