- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCBని ఫైనల్స్ కు చేర్చిన వీరులు వీళ్లే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా జరిగిన క్వాలిఫైయర్ వన్ లో గెలిచి ఫైనల్ కి వెళ్ళింది బెంగళూరు.

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా జరిగిన క్వాలిఫైయర్ వన్ లో గెలిచి ఫైనల్ కి వెళ్ళింది బెంగళూరు. జూన్ మూడో తేదీన ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... బెంగళూరు జట్టు గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో నాలుగు సార్లు ఫైనల్ కు వెళ్ళింది బెంగళూరు.
ఇప్పటికే మూడుసార్లు ఫైనల్ కు వెళ్లి బోల్తా పడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈసారి అలా కాకుండా కచ్చితంగా సంకల్పంతో ముందుకు వెళ్తోంది. అయితే.. ఈ టోర్నమెంట్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ కు వెళ్లి ఓడిపోయిన బెంగుళూరు... మొట్టమొదటగా అనిల్ కుంబ్లే ఈ పరాభవాన్ని చవిచూసింది. 2009 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో డెక్కన్ చార్జెస్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది బెంగళూరు.
ఇక 2011 లో కూడా వెటోరీ కెప్టెన్సీలో ఫైనల్ కు చేరింది బెంగళూరు. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక 2016 లో కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ గా చేరింది బెంగళూరు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ఈ సీజన్ లో రజత్ కెప్టెన్సీలో ఫైనల్ కు వెళ్ళింది బెంగళూరు. మరి ఈసారైనా గెలుస్తుందా లేదా చూడాలి.






