- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CSK కి RCB స్ట్రాంగ్ కౌంటర్... జైలు జెర్సీలతో రచ్చ !
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL2025) భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK)

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL2025) భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ( Chinna swamy stadium) జరుగుతున్న ఈ మ్యాచ్ లో ధోని ( Dhoni) టీం మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోహ్లీ ( Kohli) టీం మొదట బ్యాటింగ్ చేస్తోంది.అయితే బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను టార్గెట్ చేశారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్.
చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని... బెంగళూరు ఫాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. అందుకే 2016 నుంచి 2017 మొత్తం రెండు సీజన్లు... చెన్నై జట్టుపై బ్యాన్ విధించిన విషయాన్ని గుర్తు చేస్తూ... జైలు జెర్సీలు ( Jail Jersy) రిలీజ్ చేశారు బెంగళూరు అభిమానులు. ఆ జెర్సీలను... స్టేడియం బయట బెంగళూరు అభిమానులు... సేల్ చేస్తున్నారు అభిమానులు. ధోని టీం ను ర్యాగింగ్ చేస్తూ... ఈ దారుణానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కప్పు కొట్టడం చేతకాదు కానీ... తప్పుడు ఆరోపణలు చేసి కోహ్లీ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు చెన్నై అభిమానులు. గతంలో కూడా ఇలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును టార్గెట్ చేసి పోస్టులు పెట్టారు బెంగళూరు అభిమానులు.
Sorry csk fans you messed with wrong franchise. #RCBvsCSK pic.twitter.com/O3Qs1ONmQ9
— VK (@VK00470047) May 3, 2025






