స్టార్ క్రికెటర్ భార్యకు మంత్రి పదవి

by Ajay Maddhiboyina |

స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యను మంత్రి పదవి వరించింది. గుజరాత్ లో గురువారం సీఎం భూపేంద్ర మినహా మంత్రులు అంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు రాష్ట్రంలో నూతన కేబినెట్ ఏర్పాటైంది.

స్టార్ క్రికెటర్ భార్యకు మంత్రి పదవి
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యను మంత్రి పదవి వరించింది. గుజరాత్ లో గురువారం సీఎం భూపేంద్ర మినహా మంత్రులు అంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు రాష్ట్రంలో నూతన కేబినెట్ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో జడేజా భార్య రివాబా జడేజా సైతం కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2019లో రివాబా బీజేపీలో చేరారు. త‌ర‌వాత 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె జామ్ న‌గ‌ర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌వీంద్ర జ‌డేజా సైతం త‌మె త‌ర‌పున ప్ర‌చారం చేయ‌గా 50వేల కంటే ఎక్కువ మెజారిటీతో రివాబా ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఇక తాజాగా ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో జ‌డేజా అభిమానులు కుషీ అవుతున్నారు.

Next Story