టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రవీంద్ర జడేజా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-19 11:34:13  IST  )

టెస్టులకు రోహిత్ శర్మ(Rohit Sharma) గుడ్ బై చెప్పడంతో బీసీసీఐ(BCCI) కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు చేస్తోంది.

టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రవీంద్ర జడేజా?
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్టులకు రోహిత్ శర్మ(Rohit Sharma) గుడ్ బై చెప్పడంతో బీసీసీఐ(BCCI) కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు అంతా యంగ్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లకు పగ్గాలు ఇవ్వబోతున్నారని వార్తలు వైరల్‌ కాగా, తాజాగా మరో సీనియర్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జట్టులో ఉన్నవారిలో సీనియర్‌గా ఉన్న రవీంద్ర జడేజా(Ravindra Jadeja)కు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జడేజాతో బీసీసీఐ సంప్రదింపులు జరిపిందని.. అందుకు తాను కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఇంకో ఏడాదిన్నర, రెండేళ్ల పాటు జడేజా టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా, జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టులు ఆడనుంది. ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడబోతోంది. రాబోయే సిరీస్ గురించి చర్చించడానికి జడేజా ఇప్పటికే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను కలిసినట్లు తెలుస్తోంది. అందువల్ల ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో జడ్డూ నాయకత్వం వహించడం ఖాయం. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ పేరు వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ముందే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ జీర్ణించుకోలేకపోతున్నామని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story