జ‌డేజాకు రాజస్థాన్‌ రాయల్స్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా కెప్టెన్సీనే !

by velandi.Saikiran |

రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్ ను ఇచ్చి సంజును జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ స్కెచ్ వేసింది.

జ‌డేజాకు రాజస్థాన్‌ రాయల్స్‌  బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా కెప్టెన్సీనే !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం చెన్నై, రాజస్థాన్ రాయల్స్ చాలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే, అతని స్థానం భర్తీ చేసేందుకు ఈ ఏడాదే సంజుపై క‌న్నేసింది చెన్నై. ఇక అటు గత ఏడాది స్పిన్నర్లు లేక రాజస్థాన్ రాయల్స్ దారుణంగా విఫలమైంది. దింతో జ‌డేజాను తీసుకోవాల‌ని ప్లాన్ చేసింది రాజ‌స్థాన్‌. ఈ తరుణంలోనే ఈ రెండు జట్ల మధ్య ట్రేడ్ ట్రాక్ కొనసాగుతోంది. రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్ ను ఇచ్చి సంజును జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ స్కెచ్ వేసింది.

రాజస్థాన్ రాయల్స్ కూడా దీనికి ఓకే చెప్పింది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్తున్న రవీంద్ర జడేజాకు అదిరిపోయే దక్కినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు జడేజాకు కూడా సమాచారం అందించారట. సంజు స్థానంలో కెప్టెన్సీ చేసేందుకు జడేజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కాగా, నవంబర్ 15వ తేదీలోపు రిటెన్షన్ లిస్టు పంపించాలని బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 15వ తేదీన మినీ వేలం జరగనుందని సమాచారం.

Next Story