- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా పోయింది. కొద్దిరోజులుగా చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను వదులుకునేందుకు సిద్ధంగా ఉందని వార్తలువస్తున్న సంగతి తెలిసిందే. జడేజాను వదులుకుని 2026 ఐపీఎల్ కోసం అతడి స్థానంలో సంజు సంజు సాంసన్ ను తీసుకునేందుకు సీఎస్కే ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్న సంజు కూడా టీమ్ మారడం దాదాపు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోమవారం జడేజా ఇన్ స్టా అకౌంట్ మిస్సింగ్ కావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఏ కారణం వల్ల జడేజా ఇన్ స్టా అకౌంట్ కనిపించడంలేదో తెలియలేదు. మరోవైపు 2022 నుండి జడేజా సీఎస్కే జట్టులోనే ఉన్నాడు. కొంతకాలం పాటూ ఆ జట్టుకు కెప్టెన్ గా సైతం వ్యవహరించాడు. కానీ విఫలం అవ్వడంతో ధోనీ పగ్గాలు చేపట్టాడు.






