- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్ కాదు.. అతనే ఆడాలి.. టీ20 టీం సెలెక్షన్‌పై అశ్విన్ కామెంట్స్
టీమిండియా టీ20 టీం సెలెక్షన్‌పై అశ్విన్ స్పందించాడు. శుభ్‌మన్ గిల్ కాకుండా మరో యువ స్టార్‌ను ఆడించాలని సూచించాడు.

దిశ, స్పోర్ట్స్: ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమిండియా జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంగ్లండ్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్‌ను టీ20ల్లో కూడా వైస్ కెప్టెన్‌గా నియమించాలని కొందరు అంటుంటే.. అతన్ని పొట్టి ఫార్మాట్లో జట్టులో ఎక్కడ ఆడించాలో తెలియక సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న యశస్వి జైస్వాల్, గిల్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. దీనిపై మాజీ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో కూడా బ్యాకప్ ఓపెనర్‌గా జైస్వాల్ ఉన్నాడని, కాబట్టి అతన్ని ఆటోమేటిక్‌గా జట్టులోకి తీసుకోవాలని అశ్విన్ సూచించాడు. ‘జైస్వాల్, గిల్ ఇద్దరిలో ఎవరిని ఆడించాలని చర్చ జరుగుతోంది. గత టీ20 వరల్డ్ కప్‌లో బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్నాడు కాబట్టి జైస్వాల్‌నే ఆడించాలి. దానికితోడు మరో ఓపెనర్‌గా సంజూ శాంసన్ స్థానం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి సమయంలో గిల్‌ను టీ20 టీంలో ఇరికించడం సెలెక్టర్లకు చాలా సమస్యగా మారుతుంది’ అని అశ్విన్ వివరించాడు.






