T20WorldCup2026: సూర్యభాయ్ ఈజ్ బ్యాక్

by Gantepaka Srikanth |

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

T20WorldCup2026: సూర్యభాయ్ ఈజ్ బ్యాక్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 202)లో భాగంగా అమెరికాతో ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 29 పరుగుల తేడాతో భారత్ బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్‌మెన్‌లు అందరూ విఫలం అయినా.. కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) నిరాశ చెందలేదు. చివరి వరకూ పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తాజాగా సూర్యపై టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘సూర్య చాలా నిలకడగా ఆడాడు. ఒకానొక దశలో ఒంటరి అయిపోయినా కూడా పట్టువీడలేదు. సూర్య చేసిన పరుగుల్లో 37 శాతం స్కోర్‌ వికెట్ల వెనుక నుంచే రావడం విశేషం. ఇది నిజమైన 360 డిగ్రీ మాస్టర్‌ క్లాస్‌ బ్యాటింగ్‌. గతంలో కొన్ని జట్లు ఆ ఏరియాలోనే సూర్యని కట్టడి చేశాయి. కానీ, ఈ మ్యాచ్‌లో అతడు సమయం తీసుకున్నా.. మంచి ఫామ్‌లోకి వచ్చాడు. కెప్టెన్‌గా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు’ అని అశ్విన్‌ చెప్పుకొచ్చారు.

Next Story