- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంబోజ్ కూడా ఆ కేటగిరీలోనే..జహీర్, బుమ్రాతో పోల్చిన అశ్విన్
యంగ్ పేసర్ అన్షుల్ కాంబోజ్‌పై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. అతన్ని జహీర్, బుమ్రాతో పోల్చాడు.

దిశ, స్పోర్ట్స్: నాలుగో టెస్టుకు ముందు పేసర్ అన్షుల్ కాంబోజ్ కూడా భారత జట్టుతో చేరాడు. సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో కాంబోజ్ రాణించాడు. ఈ క్రమంలో మాజీ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాంబోజ్ కూడా జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా తరహా పేసర్ అని అశ్విన్ మెచ్చుకున్నాడు. కేవలం తన స్కిల్స్ మీదనే ఆధారపడకుండా.. మ్యాచ్ పరిస్థితులు, జట్టు ప్లాన్స్ అర్థం చేసుకొని, దానికి తగ్గట్టు బౌలింగ్ చేయగల సమర్థుడు కాంబోజ్ అని యాష్ అన్నాడు.
‘అన్షుల్‌లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే.. తను ప్లాన్ అర్తం చేసుకుంటాడు. చాలా మంది పేసర్లు ప్లాన్ పట్టించుకోరు. తమను తాము ఎక్స్‌ప్రెస్ చేస్తామని, గేమ్‌ను ఎంజాయ్ చేస్తామని అంటారు. కానీ కాంబోజ్ అలాక్కాదు. ప్లాన్స్ అర్థం చేసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇది అందరిలో ఉండే లక్షణం కాదు. జహీర్ ఖాన్‌లో ఆ లక్షణం ఉంది. తను ఎంత గొప్ప బౌలరో నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు బుమ్రా కూడా అలాంటి బౌలరే. కాంబోజ్ కూడా అలాంటోడే. అయితే నేను వాళ్ల స్కిల్స్ పోల్చడం లేదు’ అని అశ్విన్ వివరించాడు.






