- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిల్‌లో వచ్చిన మార్పు అదే.. రవిశాస్త్రి ఇంట్రస్టింగ్ కామెంట్స్!
గిల్ ఆటతీరులో వచ్చిన మార్పు ఏంటో మాజీ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. కోహ్లీలా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా యంగ్ టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. టీం హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నప్పుడే గిల్ కెరీర్ ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గిల్ ఆటతీరుపై తన అభిప్రాయం వెల్లడించిన శాస్త్రి.. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా మెరుగైందని, ముఖ్యంగా అతని డిఫెన్స్ చాలా డెవలప్ అయిందని మెచ్చుకున్నాడు. ‘కెరీర్ ఆరంభంతో పోలిస్తే బిగ్గెస్ట్ డిఫరెన్స్.. గిల్ డిఫెన్స్ అనే చెప్పాలి. తను డిఫెన్స్‌పై చాలా ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చివరగా ఇంగ్లండ్ వచ్చినప్పుడు తను కూడా విరాట్‌లాగే ఆడేవాడు. హార్డ్ హ్యాండ్స్‌తో బంతిని పుష్ చేసేవాడు. కానీ ఇప్పుడు తన టాప్ హ్యాండ్ మంచి కంట్రోల్‌లో కనిపిస్తోంది. బంతి తన వద్దకు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే తన డిఫెన్స్‌పై తనకు అంత నమ్మకం వచ్చింది. తన వద్ద అన్ని రకాల షాట్లు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. అలాంటి ప్లేయర్.. తన డిఫెన్స్‌పై కొంచెం వర్క్ చేయడం వల్ల ఇంత మెరుగయ్యాడు’ అని శాస్త్రి కొనియాడాడు.






