- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోచ్ నేనైతే అదే చేసేవాడిని.. గంభీర్‌కు కౌంటర్ ఇచ్చిన రవిశాస్త్రి
సౌతాఫ్రికా చేతిలో భారత్ టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ అవడంపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా చేతిలో భారత్ టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ అవడంపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శాస్త్రి.. తానే కోచ్ అయితే ఓటమికి బాధ్యత తీసుకునేవాడినంటూ వ్యాఖ్యానించాడు. అలాగే, ప్లేయర్లు కూడా బాధ్యతాయుతంగా ఆడాల్సిందన్నాడు. ‘గువహతి టెస్టులో ఏం జరిగింది. భారత్ 100/1 నుంచి చూస్తుండగానే 130/7కు వచ్చింది. మన జట్టు అంత చెడ్డది కాదు. చాలా ప్రతిభావంతులు ఉన్నారు. ప్లేయర్లు కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి స్పిన్ ఆడుతున్నారు.’అని తెలిపాడు. గంభీర్‌ను రక్షిస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అతన్ని తాను రక్షించడం లేదని, 100 శాతం బాధ్యత అతనిది కూడా అని చెప్పాడు. ‘నేను కోచ్‌గా ఉన్నప్పుడు జరిగి ఉంటే ముందుగా నేను బాధ్యత తీసుకునేవాడిని. కానీ, టీమ్ మీటింగ్‌లో మాత్రం ప్లేయర్ల తప్పులను ఎత్తిచూపేవాడిని’అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు 2017 నుంచి 2021 వరకు శాస్త్రి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.






