Ashwin: వైభ‌వ్ త‌ప్పేం లేదు.. లంక ప్లేయ‌ర్లే రెచ్చ‌గొట్టారు

by velandi.Saikiran |

వైభ‌వ్ త‌ప్పేం లేదని లంక ప్లేయ‌ర్లే రెచ్చ‌గొట్టారని అశ్విన్ వెల్ల‌డించారు.

Ashwin: వైభ‌వ్ త‌ప్పేం లేదు.. లంక ప్లేయ‌ర్లే రెచ్చ‌గొట్టారు
X

దిశ‌, వెబ్ డెస్క్: శ్రీలంక A జట్టు ప్లేయర్లతో వైభవ్ గొడవ పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో వైభవ్ ను దోషిగా చూపిస్తూ యాక్షన్ తీసుకోవాలని పలువురు డిమాండ్ కూడా చేస్తున్నారు. 15 ఏళ్ల వైభవ్ కెరీర్ ను అంతమొందించే కుట్రలకు తెరలేపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ గొడవపై భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. నిన్న జరిగిన సంఘటనలో వైభవ్ తప్పేం లేదని, శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టినట్లు మండిపడ్డారు.

మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా వైభవ్ నడుచుకుంటూ వెళ్తున్నాడని, ఆ సమయంలో లంక ప్లేయర్లే అనవసరంగా రెచ్చగొట్టినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే వైభవ్ కూడా రివర్స్ అయినట్లు గుర్తు చేశారు. వీడియో చూస్తే మనకు క్లారిటీగా ఇది అర్థమవుతుందన్నారు. అనవసరంగా వైభవ్ పై తప్పుడు ప్రచారం చేయకండని కోరారు. వైభవ్ పై యాక్షన్ తీసుకునే ముందు ఐసీసీ అన్ని విషయాలను ప‌రిశీలించాల‌న్నారు.

Next Story