అత్యాచార ఆరోపణల కేసు.. ఆర్సీబీ ప్లేయర్‌కు ఊహించని షాక్

by Kema Shiva Kumar |

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌ (Yash Dayal)కు ఊహించని షాక్ తగిలింది.

అత్యాచార ఆరోపణల కేసు.. ఆర్సీబీ ప్లేయర్‌కు ఊహించని షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌ (Yash Dayal)కు ఊహించని షాక్ తగిలింది. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణల కేసులో జైపూర్ పోక్సో కోర్టు (Jaipur Pocso Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యశ్ దయాళ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అదేవిధంగా విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో నిందితుడిపై ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలు మొబైల్ చాట్ హిస్టరీ, ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డులు, హోటల్ రికార్డులు ఆరోపణలను బలపరుస్తున్నాయని కోర్టు తెలిపింది. ఈ దశలో నిందితుడి అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పలేమని, అందుకే యశ్ దయాళ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పోక్సో కోర్టు తేల్చి చెప్పింది.

కాగా, మైనర్ బాలికపై యశ్ దయాళ్ 2023 నుంచి దాదాపు రెండేళ్ల పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, అదేవిధంగా జైపూర్, కాన్పూర్ హోటల్స్‌తో పాటు IPL-2025 సమయంలో జైపూర్ సీతాపుర హోటల్‌లో మరోసారి తనపై లైంగిక దాడి జరిగిందని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. గతంలో రాజస్థాన్ హైకోర్టు కూడా యశ్ అరెస్ట్‌పై ఇంటరిం బెయిల్ ఇవ్వకుండా నిరాకరించిన విషయం తెలిసిందే.

Next Story