10 ఏళ్ల తర్వాత దేశవాళీ ఆడబోతున్న రోహిత్.. స్పందించిన రహానె

by Harish |

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు 10 ఏళ్ల తర్వాత దేశవాళీ ఆడబోతున్నాడు.

10 ఏళ్ల తర్వాత దేశవాళీ ఆడబోతున్న రోహిత్.. స్పందించిన రహానె
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు 10 ఏళ్ల తర్వాత దేశవాళీ ఆడబోతున్నాడు. చివరిసారిగా 2015లో రంజీ మ్యాచ్ ఆడాడు. రంజీ ట్రోఫీలో జమ్ము కశ్మీర్‌తో నేటి నుంచి మొదలయ్యే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రోహిత్‌‌కు సీనియర్ బ్యాటర్, ముంబై కెప్టెన్ అజింక్యా రహానె మద్దతుగా నిలిచాడు. బుధవారం మీడియాతో రహానె మాట్లాడుతూ.. రోహిత్ పరుగుల ఆకలితో ఉన్నాడని, కచ్చితంగా రాణిస్తాడని తెలిపాడు. ‘నిన్న రెండు నెట్ సెషన్స్‌లో బాగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్‌పై నేను నమ్మకంగా ఉన్నా. అతను చాలా రిలాక్స్డ్‌గా ఉంటాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ అలాగే ఉంటాడు. తన ఆట గురించి అతనికి తెలుసు. ఎవరూ అతనికి చెప్పాల్సిన అవసరం లేదు.’ అని రహానె చెప్పుకొచ్చాడు. అలాగే, ఈ నెల 30 నుంచి మేఘాలయాతో జరిగే మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడా?లేదా? అనేది తనకు కచ్చితంగా తెలియదని చెప్పాడు.


Next Story