- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబర్ కు డ్రామాలు ఎక్కువ.. ఆట తక్కువ...పరువు తీసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్
రమీజ్ రాజా మాత్రం ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. తన మైక్ ఆఫ్ లో ఉందని అనుకున్న రమీజ్ రాజా, బాబర్ పై

దిశ, వెబ్ డెస్క్ : లాహోర్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రారంభమైన ఈ మ్యాచ్ లో రెండు జట్లు అద్భుతంగానే రాణిస్తున్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో 378 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్తాన్ ఓ దశలో బాగానే ఆడింది. ఇక ఇప్పుడు దక్షిణ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన బాబర్ ఆజం మరోసారి విఫలమయ్యాడు. 23 పరుగులకే ఔట్ అయ్యాడు. అయితే బాబర్ ఆజంపై పాకిస్తాన్ కు సంబంధించిన రమీజ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజాంను అవమానించేలా ఆయన దారుణంగా ట్రోలింగ్ చేశారు.
బాబర్ ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా బౌలర్ ముతుస్వామి ( Senuran Muthusamy ) బౌలింగ్ వేశాడు. ఆ సమయంలో బాబర్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి, విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్ కు తగిలిందనుకొని సఫారీ ప్లేయర్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే బ్యాట్ కు తగలలేదని భావించి, రివ్యూ తీసుకున్నాడు బాబర్. రివ్యూ లో నాట్ అవుట్ గా తేలిపోయింది.
కానీ కామెంటేటర్ గా ఉన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా మాత్రం ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. తన మైక్ ఆఫ్ లో ఉందని అనుకున్న రమీజ్ రాజా, బాబర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అది ఖచ్చితంగా ఔటే కానీ బాబర్ ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేస్తాడు. రివ్యూ కోరుతాడు అని మాట్లాడాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రికార్డు అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో రమీజ్ రాజా పై పాకిస్తాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లిక్






