- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వన్డేల్లోకి రోహిత్, కోహ్లీ రీ-ఎంట్రీ.. బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (VIRAT KOHLI ) అలాగే వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (ROHIT SHARMA)... ఇద్దరూ రీ ఎంట్రీ ఎప్పు

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (VIRAT KOHLI ) అలాగే వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (ROHIT SHARMA)... ఇద్దరూ రీ ఎంట్రీ ఎప్పుడు చేస్తారని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలికి ( BCCI) సంబంధించిన రాజీవ్ శుక్లా ( RAJEEV SHUKLA) కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అంతేకాదు... టీమిండియా ఆడే ప్రతి వన్డే మ్యాచ్ కు కూడా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా. ఇందులో ఎలాంటి డౌట్ ఉండబోదని తెలిపారు. అయితే ఈ ఇద్దరు ఎప్పుడూ జట్టులోకి వస్తారనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య వచ్చే నెలలో వన్డే సిరీస్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ టోర్నమెంట్ వచ్చే నెలలో జరిగితే కచ్చితంగా రోహిత్ శర్మ అలాగే విరాట్ శర్మ ఇద్దరు కూడా వన్డేల్లోకి ఎంట్రీ ఇస్తారు.






