- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB విజయం..ఊర మాస్ స్టెప్పులతో కెప్టెన్ రచ్చ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025 ) టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalor

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025 ) టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team) విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నాయి. నిన్న అర్ధరాత్రి.. బెంగళూరు టైటిల్ గెలవగానే... దేశవ్యాప్తంగా.. కోహ్లీ అభిమానులు ( Kohli Fans) సంబరాలు చేసుకున్నారు. బెంగళూరు నగరంలో అయితే... ఐదు నెలల ముందే దీపావళి వచ్చినట్లు అయింది.
టపాకాయలు పేల్చుతూ.. ఫుల్ జోష్ లో కనిపించారు అభిమానులు. అయితే ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ( Rajat Patidar) వీడియో వైరల్ గా మారింది. టైటిల్ గెలిచిన తర్వాత... హోటల్లో తీన్మార్ స్టెప్పులకు డాన్సులు వేశాడు బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్.
బ్యాండ్ మేళంకు... తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూ రచ్చ చేశాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ ను చూసి మిగతా ప్లేయర్లు కూడా డాన్సులు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు... బెంగళూరు జట్టు మంచి జోష్ లో ఉందని కామెంట్ చేస్తున్నారు. 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిస్తే ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.






