- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో పటీదార్, రాథోడ్ సెంచరీలు.. భారీ ఆధిక్యంలో సెంట్రల్ జోన్
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పటీదార్, యష్ రాథోడ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో సౌత్ జోన్‌పై ఆ టీం భారీ ఆధిక్యంలో నిలిచింది.

దిశ, స్పోర్ట్స్: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పటీదార్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్‌ను 149 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 384/5 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో సౌత్ జోన్‌పై 235 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పటీదార్ (101) సెంచరీతో చెలరేగాడు. ఇది అతని కెరీర్లో 15వ ఫస్ట్ క్లాస్ శతకం కావడం గమనార్హం. క్వార్టర్ ఫైనల్‌లో కూడా సెంచరీతో రాణించిన పటీదార్.. సెమీస్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్‌లో పటీదార్‌తోపాటు యష్ రాథోడ్ (137 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆట ముగిసే సమయానికి రాథోడ్‌తోపాటు శరన్ష్ జైన్ (47 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జప్‌నీత్ సింగ్ మూడు వికెట్లతో రాణించాడు.






