RR vs RCB : రాజస్తాన్ ఇన్నింగ్స్ కంప్లీట్.. బెంగుళూర్ టార్గెట్ ఎంతంటే?

by Muthe.Rajitha |   (  Updated:2025-04-13 12:16:17  IST  )

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్, బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్(RR vs RCB) జట్లు తలపడుతున్నాయి.

RR vs RCB : రాజస్తాన్ ఇన్నింగ్స్ కంప్లీట్.. బెంగుళూర్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్(RR vs RCB) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేయడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal) 75, రియాన్ 30, జురేల్ 35 పరుగులు చేసి స్కోర్ బోర్డును ఓ మాదిరిగా పరుగెత్తించే ప్రయత్నం చేశారు. ఇక బెంగుళూరు బౌలర్స్ లో యశ్ దయాళ్, హెజిల్ వుడ్, భువనేశ్వర్, కృనాల్ తలా ఒక వికెట్ తీశారు. 174 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగనుంది.

Next Story