- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు గుజరాత్ తో మ్యాచ్.. ఓడితే రాజస్థాన్ రాయల్స్ ఇంటికే
ఐపీఎల్ 2025 (IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasth

దిశ వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 (IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) మధ్య మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ రాయల్స్ కు చాలా కీలకం. ఒకవేళ ఓడిపోతే.. ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ రాయల్స్... 7 ఓటమిలతో... 9వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చాలా కీలకం కానుంది. ఇవాళ ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఇవాళ ఓడిపోయి మిగిలిన నాలుగు మ్యాచ్ లలో గెలిచినా కూడా... రాజస్థాన్ జట్టుకు కష్టమే.
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XII: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, ఆకాశ్ మధ్వల్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే/
గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XII: శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ






