- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్ రాయల్స్‌కు తొలి విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతీలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది.

- చెన్నైపై 6 పరుగులు తేడాతో గెలుపు
- కెప్టెన్ గైక్వాడ్ పోరాటం వృధా
- దంచి కొట్టిన రాయల్స్ ఆటగాడు రాణా
- చెన్నైకి వరుసగా రెండో ఓటమి
దిశ, స్పోర్ట్స్: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సొంత ఊరిలో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 182 పరుగులు సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంతో చెన్నై సూపర్ కింగ్స్ మరో సారి తడబడింది. కెప్టెన్ గైక్వాడ్ అర్థ సెంచరీతో పోరాడినా.. ఆఖర్లో రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించినా.. లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. దీంతో రాజస్థాన్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతీలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. 183 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (0) ఖాతా తెరవకుండానే పెవీలియన్ చేరాడు. మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (23) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. గైక్వాడ్ కేవలం 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అయితే శివమ్ దూబే (18), విజయ్ శంకర్ (9) తక్కువ స్కోరుకే అవుడటంతో ఒత్తిడి పెరిగింది. గైక్వాడ్ ఔటయ్యాక రవీంద్ర జడేజా వేగంగా పరుగులు సాధించాడు. గత మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ మ్యాచ్‌లో ముందుగానే వచ్చినా ఫలితం లేకపోయింది. ఆఖరి ఓవర్లో ధోనీ (16) పెవీలియన్ చేరిన తర్వాత జడేజా (32), ఓవర్టన్ (11) విజయం కోసం ప్రయత్నించినా.. సందీప్ శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వానిందు హసరంగ 4 వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మకు తలా ఒక వికెట్ లభించింది. నితీశ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
దంచి కొట్టిన నితీశ్ రాణా..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టును నితీశ్ రాణా ఆదుకున్నాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), సంజూ శాంసన్ (20) తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో బ్యాటింగ్ భారాన్ని నితీశ్ తనపై వేసుకన్నాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ (37), హెట్‌మెయర్ (19) కాస్త పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీతం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీష పతిరానా తలా రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు:
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్ (సి) అశ్విన్ (బి) ఖలీల అహ్మద్ 4, సంజూ శాంసన్ (సి) రచిన్ రవీంద్ర (బి) నూర్ అహ్మద్ 20, నితీశ్ రాణా (స్టంపింగ్) ధోనీ (బి) అశ్విన్ 81, రియాన్ పరాగ్ (బి) మతీష పతిరానా 37, ధ్రువ్ జురెల్ (సి) మహీష పతిరానా (బి) నూర్ అహ్మద్ 3, వానిందు హసరంగ (సి) విజయ్ శంకర్ (బి) రవీంద్ర జడేజా 4, హెట్‌మెయర్ (సి) అశ్విన్ (బి) మహీష పతిరానా 19, జోఫ్రా ఆర్చర్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) ఖలీల్ అహ్మద్ 0, కుమార కార్తియేయ (రనౌట్) 1, మహీష తీక్షణ 2 నాటౌట్, తుషార్ దేశ్‌పాండే 1 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 10; మొత్తం 182/9(20 ఓవర్లు)
వికెట్ల పతనం : 4-1, 86-2, 124-3, 134-4, 140-5, 166-6, 174-7, 175-8, 176-9
బౌలింగ్ : ఖలీల్ అహ్మద్ (4-0-38-2), జేమీ ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1), నూర్ అహ్మద్ (4-0-28-2), మహీష పతిరానా (4-0-28-2), రవీంద్ర జడేజా (2-0-10-1)
చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర (సి) ధ్రువ్ జురెల్ (బి) జోఫ్రా ఆర్చర్ 0, రాహుల్ త్రిపాఠి (సి) హెట్‌మెయర్ (బి) వానిందు హసరంగ 23, రుతురాజ్ గైక్వాడ్ (సి) యశస్వి జైస్వాల్ (బి) వానిందు హసరంగ 63, శివం దూబే (సి) రియాన్ పరాగ్ (బి) వానిందు హసరంగ 18, విజయ్ శంకర్ (బి) వానిందు హసరంగ 9, రవీంద్ర జడేజా 32 నాటౌట్, ఎంఎస్ ధోనీ (సి) హెట్‌మెయర్ (బి) సందీప్ శర్మ 16, జేమీ ఓవర్టన్ 11 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 4; మొత్తం 176/6(20 ఓవర్లు)
వికెట్ల పతనం: 0-1, 46-2, 72-3, 92-4, 129-5, 164-6
బౌలింగ్ : జోఫ్రా ఆర్చర్ (3-1-13-1), తుషార్ దేశ్‌పాండే (4-0-45-0), సందీప్ శర్మ (4-0-42-1), మహీష తీక్షణ (4-0-30-0), వానిందు హసరంగ (4-0-35-4), కుమార్ కార్తికేయ (1-0-10-0)






