రాజస్థాన్ రాయల్స్ 'హెడ్ కోచ్' గా.. ద్రావిడ్.!

by Geesa Chandu |

గతంలో టీమిండియాకు హెడ్ కోచ్ గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ ను.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు మెంటార్ గా తీసుకోవాలనే వార్తలకు బలం చేకూరుతోంది. ఈ విషయంలో ద్రావిడ్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా.. ద్రావిడ్.!
X

దిశ, వెబ్ డెస్క్: గతంలో టీమిండియాకు హెడ్ కోచ్ గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ ను.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు మెంటార్ గా తీసుకోవాలనే వార్తలకు బలం చేకూరుతోంది. ఈ విషయంలో ద్రావిడ్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ద్రావిడ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదివరకే ఆర్ఆర్ కు మెంటార్ గా ఉన్న సంగక్కర స్థానాన్ని, ద్రావిడ్ తో భర్తీ చేయనుందట రాజస్థాన్ రాయల్స్. అయితే ఈ శ్రీలంకన్ మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర త్వరలో ఇంగ్లాండ్ టీం హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ద్రావిడ్ గతంలో ఆర్ఆర్ టీం కు కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా ఉంది.

Next Story