చాలా బాధాకరం.. బెంగళూరు తొక్కిసలాటపై రాహుల్ ద్రావిడ్

by Phanindra |

బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. చాలా బాధాకరమైన ఘటన అని చెప్పాడు.

చాలా బాధాకరం.. బెంగళూరు తొక్కిసలాటపై రాహుల్ ద్రావిడ్
X

దిశ, స్పోర్ట్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విక్టరీ సెలబ్రేషన్స్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది విగతజీవులుగా మారిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. ఇది చాలా బాధాకరమని, దురదృష్టకరమని అన్న ద్రావిడ్.. బాధితులకు సానుభూతి తెలిపారు.


‘ఈ సిటీలో క్రీడలకు చాలా మద్దతుంటుంది. కేవలం క్రికెట్‌కే కాదు. ఏ ఆట అయినా అంతే ప్యాషనేట్‌గా మద్దతిస్తారిక్కడి ప్రజలు. ఇక ఆర్సీబీకి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అందుకే ఈ ఘటన ఇంకా బాధిస్తుంది. గాయపడిన వారు, మరణించిన వారి కుటుంబాలను తలచుకుంటే ఆ బాధ రెట్టింపవుతుంది’ అని చెప్పాడీ లెజెండరీ క్రికెటర్. కాగా, చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా ప్రజలు రావడంతో అక్కడ డ్రెయిన్‌పై వేసిన డోర్ కూలిందని, ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందడంతోనే తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.

Next Story