- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : KKR పగ్గాలు రహానే చేతికి
డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR).. తన జట్టు పగ్గాలు అజింక్య రహానే(Ajinkya Rahane)కు అందించింది.

దిశ, వెబ్ డెస్క్ : డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR).. తన జట్టు పగ్గాలు అజింక్య రహానే(Ajinkya Rahane)కు అందించింది. మరో రెండు వారాల్లో క్రికెట్ ప్రియుల పండగ ఐపీఎల్(IPL 2025) మొదలవనుండగా.. కేకేఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అదే విధంగా వెంకటేష్ అయ్యర్(Venkatesh Ayyar) కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. అయితే గత ఐపీఎల్ లో కప్పు సాధించిపెట్టిన శ్రేయాస్ అయ్యర్(Shreyas Ayyar) ను ఈసారి కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో కూడా కొనలేదు. ఆ స్థానాన్ని వెంకటేష్ అయ్యర్ తో భర్తీ చేసేందుకు వెంకటేష్ పై భారీ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసింది.
అనుకున్నట్టు గానే వెంకటేష్ కు జట్టులో కీలక బాధ్యతలు అప్పగించింది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం కొత్త జెర్సీ(KKR New Jersy)ని కేకేఆర్ నేడు ఆవిష్కరించింది. ఈ మేరకు కేకేఆర్ తన ఎక్స్ ఖాతాలో వివరాలు పోస్ట్ చేసింది. జెర్సీపై గల 3 స్టార్ల అర్థం.. ఇప్పటి వరకు ఆ జట్టు 3 టైటిల్లను సాధించడాన్ని సూచిస్తుందని తెలిపింది. 2012, 2014, 2024 సంవత్సరాలలో కేకేఆర్ సాధించిన టైటిల్లకు ప్రత్యేక పేర్లను ఇచ్చింది. అవి వరుసగా కర్బో, లోర్బో, జీత్బో అని తెలిపింది. ఈ మూడు పేర్లు బెంగాలీలో ప్రదర్శన, పోరాటం, గెలుపును సూచిస్తాయి.






