రఫెల్ నదాల్ అకాడమీలో మాయా రాజేశ్వరన్

by Ajay Maddhiboyina |

తొలి మ్యాచ్‌లో బెలారస్‌కు చెందిన ఇరినా షైమనోవిచ్‌ను 6-4, 6-1 తేడాతో ఓడించింది. ఆ తర్వాత కజకిస్తాన్‌కు చెందిన మాజీ టాప్ 50 క్రీడాకారిణి జరీనా దియాస్‌ను ఓడించింది.

రఫెల్ నదాల్ అకాడమీలో మాయా రాజేశ్వరన్
X

- ముంబై ఓపెన్ సెమీస్‌కు చేరిన మాయా

- ఇండియన్ టెన్నిస్ సెన్సేషన్‌గా ఎదుగుతున్న మాయా

దిశ, స్పోర్ట్స్: భారత టెన్నిస్ సంచలనం మాయా రాజేశ్వరన్ ప్రస్తుతం రఫెల్ నదాల్ అకాడమిలో కోచింగ్ తీసుకుంటోంది. మాజీ ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నదాల్ స్వయంగా మాయా రాజేశ్వరన్ ఆటకు మెరుగులు దిద్దుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 15 ఏళ్ల మాయా ఇటీవల ఎల్ అండ్ టీ ముంబై ఓపెన్ 125 సిరీస్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆమె టెన్నిస్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మాయా క్వాలిఫయర్స్ మొదటి రౌండ్‌లో ప్రపంచ 264వ ర్యాంకర్ ఇటలీకి చెందిన నికోల్ ఫోసా హుర్గోను 6-3, 3-6, 6-0 తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఆమె ప్రపంచ 434వ ర్యాంకర్ అమెరికాకు చెందిన జెస్సికా ఫైల్లాను 7-6, 1-6, 6-4 తేడాతో ఓడించి ప్రధాన డ్రాకు అర్హత సాధించింది.

తొలి మ్యాచ్‌లో బెలారస్‌కు చెందిన ఇరినా షైమనోవిచ్‌ను 6-4, 6-1 తేడాతో ఓడించింది. ఆ తర్వాత కజకిస్తాన్‌కు చెందిన మాజీ టాప్ 50 క్రీడాకారిణి జరీనా దియాస్‌ను ఓడించింది. జపాన్‌కు చెందిన మెయి యమగుచిని 6-4, 3-6, 6-2 తేడాతో ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీఏ పాయింట్లు సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారత టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచింది. మాయ ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంక్ 646కు చేరింది. టాప్ 700లో ఉన్న అతి పిన్న వయస్కురాలు మాయానే కావడం గమనార్హం.

Next Story