- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్‌లో పోటీ ఎక్కడుంది?.. ఆ జట్లు భారత్‌ను తట్టుకోగలవా? : ఆర్. అశ్విన్
ఆసియా కప్‌పై భారత మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : యూఏఈ వేదికగా మంగళవారం నుంచి ప్రారంభమైన ఆసియా కప్‌పై భారత మాజీ క్రికెటర్ ఆర్. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. టోర్నీలో పోటీతత్వం లేకపోవడంపై విమర్శలు గుప్పించాడు. ఆసియా కప్‌లో భారత్‌కు పోటీ ఇచ్చే జట్లు లేవని, టోర్నీ ఏకపక్షంగా సాగుతుందన్నాడు. ఆసియా కప్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని చెప్పాడు. టోర్నీలో పోటీ పెరగాలంటే సౌతాఫ్రికా జట్టును చేర్చి ఆసియా కప్‌ను ఆఫ్రో ఆసియా కప్‌గా మార్చాలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ ‘ఏ’ జట్టును చేర్చినా పోటీ ఉంటుందన్నాడు.
‘బంగ్లాదేశ్ గురించి మాట్లాడం. ఆ జట్టు గురించి మాట్లాడటానికి ఏం లేదు. ఈ జట్లు భారత్‌కు పోటీనివ్వగలవా?. టీ20 వరల్డ్ కప్-2026కు ఆసియా కప్ కర్టన్‌రైజర్ కాదు. కేవలం కర్టెన్ మాత్రమే. ప్రపంచకప్‌కు ఈ టోర్నీ కొలమానం కాదు. అఫ్గాన్ బౌలర్లను ఎదుర్కొని భారత్ 170+ పరుగులు చేయగలదు. ఆ స్కోరును అఫ్గాన్ చేజ్ చేయగలదా?.. అది అసాధ్యం. భారత్‌ను ఓడించాలంటే 155 రన్స్‌కు పరిమితం చేయడం, దాన్ని చేజ్ చేయడం ఒక్కటే మార్గం. టీ20లు థ్రిల్లింగ్‌గానే ఉంటాయి. కానీ, ఆసియా కప్‌ను భారత్ ఏకపక్షంగా ఆడుతుంది.’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.






