అప్పుడు రిటైర్మెంట్ ఇద్దామనుకున్నా.. ఎందుకు ఆగానంటే : అశ్విన్

by Harish |

భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పుడు రిటైర్మెంట్ ఇద్దామనుకున్నా.. ఎందుకు ఆగానంటే : అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరికీ షాకిచ్చాడు. అయితే, గతేడాది బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆడటం ద్వారా అతను కెరీర్‌లో 100వ టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత అశ్విన్ రిటైర్ అవ్వాలని భావించడట. ఈ విషయాన్ని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో అశ్వినే వెల్లడించాడు. కానీ, ఆ టెస్టులో సెంచరీతోపాటు ఆరు వికెట్లు తీసి రాణించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు అశ్విన్ తెలిపాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే నా 100వ టెస్టు తర్వాత రిటైర్ కావాలనుకున్నా. బంగ్లాదేశ్‌తో చెన్నయ్‌లో జరిగే టెస్టుతో ముగించాలనుకున్నా. కానీ ఆ మ్యాచ్‌లో శతకంతోపాటు ఆరు వికెట్లు తీశా. బాగా ఆడుతున్నప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఆడటం సరైందే అనుకున్నా. అందుకే కొనసాగాను.’ అని చెప్పాడు. అయితే, కుటుంబానికి సమయం కేటాయించకపోవడం రిటైర్మెంట్‌కు దారితీసిన అంశాలలో ఒకటని తెలిపాడు. అలాగే, ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తనను పక్కనపెట్టడం ఎమోషనల్‌కు గురి చేసిందని, రిటైర్మెంట్‌కు పరోక్షంగా అది కూడా ఓ కారణమని వెల్లడించాడు.


Next Story