ఇషాన్ కిషన్‌ రీఎంట్రీకి అదొక్కటే కారణం.. కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్

by Harish |

భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20 ప్రపంచకప్-2026కు ఎంపికైన విషయం తెలిసిందే.

ఇషాన్ కిషన్‌ రీఎంట్రీకి అదొక్కటే కారణం.. కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20 ప్రపంచకప్-2026కు ఎంపికైన విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత అతను జాతీయ జట్టులోకి తిరిగి రావడంపై భారత మాజీ క్రికెటర్ ఆర్.అశ్విన్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ఇషాన్‌కు రీఎంట్రీ అనేది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్ అని వ్యాఖ్యానించాడు. ‘అతన్ని తీసుకోవడాన్ని కొందరు న్యాయం అనుకోవచ్చు. ఇంకొందరు అన్యాయం అనుకోవచ్చు. కానీ, జీవిత చక్రం తిరిగి అక్కడికే వస్తుంది. అతను జట్టులో ఉండటానికి ఒకే కారణం ఉంది. క్రికెట్‌ను గౌరవించాడు.’అని తెలిపాడు. అలాగే, దేశవాళీ క్రికెట్ ఆడటాన్ని ఇషాన్ కిందపడటంగా చూడలేదని, తిరిగి రావడానికి ఏకైక మార్గంగా భావించాడని చెప్పాడు. ఇది కేవలం ఇషాన్ కిషన్ అనే వ్యక్తి గురించి కాదని, ఆటను గౌరవించి సక్సెస్ అయిన క్రికెటర్ ఇషాన్ కిషన్ గురించి అని తెలిపాడు.


Next Story