- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా మాస్టర్స్‌లో సింధు శుభారంభం
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది.

దిశ, స్పోర్ట్స్ : చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో నెగ్గి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-5, 21-10 తేడాతో డెన్మార్క్‌కు చెందిన జూలీ జాకోబ్‌సెన్‌ను మట్టికరిపించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్ టోర్నీలో సింధుపై జాకోబ్‌సెన్ పైచేయి సాధించింది. ఆ ఓటమికి సింధు తాజాగా ప్రతీకారం తీర్చుకుంది.
సింధు దూకుడు ముందు ప్రత్యర్థి నిలువలేకపోయింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. కేవలం 27 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుందంటే సింధు ఏ మేరకు ఆధిపత్యం ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రీక్వార్టర్స్‌లో ఆమె థాయిలాండ్ షట్లర్ పోర్న్‌పావీ చొచువాంగ్‌తో తలపడనుంది. గెలుపుటముల్లో ప్రత్యర్ధిపై 6-5తో స్వల్ప ఆధిక్యం కలిగిన సింధు మరోసారి థాయి ప్లేయర్‌ను ఓడిస్తుందో చూడాలి. మరోవైపు, యువ ఆటగాడు ఆయుశ్ శెట్టి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. వరల్డ్ నం.5 ప్లేయర్ చౌ టియోన్ చెన్(చైనీస్ తైపీ) చేతిలో 19-21, 21-12, 16-21 తేడాతో పోరాడి ఓడిపోయాడు. నిర్ణయాత్మక మూడో గేములో ఒక దశలో 13-10తో ఆధిక్యంలో నిలిచిన ఆయుశ్ అనూహ్యంగా పట్టు కోల్పోయి మ్యాచ్‌ు సమర్పించుకున్నాడు.






