రాణించిన సూర్య... పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-05-26 16:00:19  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

రాణించిన సూర్య... పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్స్ నష్టపోయి ఏకంగా 184 పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ సూర్య కుమార్ యాదవ్ మాత్రం.. ముంబై ఇండియన్స్ ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి.. సూర్య కుమార్ యాదవ్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలవాలంటే... 185 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో... సూర్య కుమార్ యాదవ్ 39 బంతుల్లో 57 పరుగులు చేశాడు.

చివరలో అర్షదీప్ సింగ్ వేసిన అద్భుతమైన బౌలింగ్కు ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు సూర్య కుమార్ యాదవ్. ఇక అటు రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో 24 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 26 పరుగులు చేసి చివరి వరకు ఆడ లేకపోయారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో...అర్షదీప్... నాలుగు ఓవర్లు వేసి రెండు కీలక వికెట్లు తీశాడు. అటు జాన్సీన్ రెండు వికెట్లు తీయగా... అటు విజయ్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.

Next Story