టీమిండియాలో బెస్ట్ టెస్ట్ బ్యాటర్ రాహులే.. కానీ భారీ స్కోర్లు ముఖ్యం!

by Phanindra |   (  Updated:2025-06-23 14:02:16  IST  )

టీమిండియాలో బెస్ట్ టెస్ట్ బ్యాటర్ రాహులే అని, కానీ తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోవాలని పుజారా చెప్పాడు.

టీమిండియాలో బెస్ట్ టెస్ట్ బ్యాటర్ రాహులే.. కానీ భారీ స్కోర్లు ముఖ్యం!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా బెస్ట్ టెస్టు బ్యాటర్ కేఎల్ రాహుల్ అని వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా అన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో రాహుల్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలోనే రాహుల్‌పై పుజారా ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి ఇన్నింగ్సులో కూడా రాహుల్ చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మంచి ఆరంభం లభించినా.. దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.


ఇదే విషయాన్ని ఎత్తిచూపిన పుజారా.. ‘భారత్‌లో అత్యంత టెక్నికల్ బ్యాటర్ రాహులే. తన ఫుట్‌వర్క్, బంతిని టైం చేసే విధానం, లెంగ్త్‌ను జడ్జ్ చెయ్యడం.. తను ఒక కంప్లీట్ టెస్ట్ ప్లేయర్. అదే టైంలో తను భారీ స్కోర్లు కూడా చెయ్యాలి. తనకు మంచి ఆరంభాలు లభించినా.. వాటిని చాలాసార్లు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్సులో కూడా అదే జరిగింది’ అని వివరించాడు.

Next Story