Pro Kabaddi: ప్రో కబడ్డీ లీగ్ సీజన్-9 వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచంటే..!

by Dishanational4 |
Pro Kabaddi: ప్రో కబడ్డీ లీగ్ సీజన్-9 వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచంటే..!
X

ముంబై: కబడ్డీ క్రీడా అభిమానులకు శుభవార్త. ప్రో కబడ్డీ లీగ్ సీజన్-9 త్వరలో ప్రారంభం కానుంది. 2022 అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ వరకు ప్రో కబడ్డీ సీజన్-9 పోటీలు జరగనున్నాయని మషాల్ స్పోర్ట్స్ నిర్వాహకులు ప్రకటించారు. బెంగళూరు, పూణె, హైదరాబాద్ వేదికగా లీగ్ జరగనుందని సీఈఓ అనుపమ్ గోస్వామి శుక్రవారం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గతేడాది కరోనా కారణంగా సీజన్-8 లీగ్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాం. కానీ సీజన్-9 ప్రేక్షకుల కోలాహలం మధ్య నిర్వహించడం జరుగుతుంది. క్రీడా అభిమానులను ఉర్రూతలూగించడానికి అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్ వచ్చేస్తోంది. ఈ సీజన్ మరింత ఉత్సాహాన్ని నింపనుంది.' అని అనుపమ్ గోస్వామి అన్నారు. కాగా, దేశంలో ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్‌ను సంపాదించిన ఆట ప్రో కబడ్డీ. ఇది గ్రామీణ క్రీడ అయినా.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. ఆగస్టు 5, 6 తేదీల్లోనే సీజన్-9కు సంబంధించిన ప్లేయర్లకు వేలం వేయడం జరిగింది.


Next Story