వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన ప్రియా, విశ్వజిత్‌

by Harish |

అండర్-23 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది.

వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన ప్రియా, విశ్వజిత్‌
X

దిశ, స్పోర్ట్స్ : సెర్బియాలో జరుగుతున్న అండర్-23 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. శుక్రవారం రెండు కాంస్య పతకాలు దక్కాయి. గ్రీకో రోమన్ 55 కేజీల కేటగిరీలో విశ్వజిత్ మోరె, మహిళల 76 కేజీల కేటగిరీలో ప్రియా మాలిక్ మెడల్స్ గెలిచారు. విశ్వజిత్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ప్రస్తుత ఆసియా అండర్-23 చాంపియన్ యెరాస్సిల్ మామిర్బోకేవ్‌ను మట్టికరిపించాడు.హోరాహోరీగా సాగిన బౌట్‌లో విశ్వజిత్ 5-4 తేడాతో గెలిచాడు. అండర్-23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గతేడాది కాంస్యం గెలిచిన అతనికి వరుసగా ఇది రెండో మెడల్. మరోవైపు, ప్రియా తొలిసారిగా మెడల్ సాధించింది. బ్రాంజ్ మెడల్ పోరులో ప్రియా 8-1 తేడాతో మెక్సికోకు చెందిన జిమెనెజ్ విల్లాల్బా‌పై ఏకపక్ష విజయం సాధించింది. 53 కేజీల కేటగిరీలో హన్సిక సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్ రెజ్లర్ దిల్షోడా మట్నజరోవాపై గెలుపొందింది. నిషు(55 కేజీలు), పుల్‌కిత్(65 కేజీలు), శ్రిష్టి(68 కేజీలు) బ్రాంజ్ మెడల్ కోసం పోటీపడనున్నారు.


Next Story